Saturday, April 26, 2025

కర్రెగుట్టలను చుట్టుముట్టిన బలగాలు.. 28 మంది మావోయిస్టులు హతం

- Advertisement -
- Advertisement -

ములుగు: కర్రెగుట్లలను చుట్టుముట్టిన పోలీసు బలగాలు.. మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు. ఆపరేషన్‌ కర్రెగుట్ల పేరుతో ఐదురోజలుగా దాదాపు 50 వేల మంది చత్తీస్‌గఢ్, తెలంగాణకు చెందిన పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ వైపున భారీ ఎన్‌కౌంటర్‌ జరిపారు. ఇందులో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వాజేడు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించి మావోల ఏరివేత షురూ చేసినట్లు సమాచారం. కర్రెగుట్టల్లో వెయ్యి మందికిపైగా మావోయిస్టులు ఉన్నారని పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు, భారీగా పోలీసులు మోహరించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కర్రెగుట్టలల్లో వెంటనే కూంబింగ్‌ ఆపాలని అటు మావోయిస్టులతోెపాటు పౌర సమాజం విజ్ఞప్తి చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News