Wednesday, January 22, 2025

చంపిన వ్యక్తి కలలోకి వచ్చి కలవరపెడుతున్నాడని…. పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బాలోద్ జిల్లాలో తాను చంపిన వ్యక్తి కలలోకి వచ్చి కలవరపెడుతున్నాడని నిందితుడు గ్రామస్థులకు తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. మృతదేహం కోసం గత సంవత్సరం నుంచి వెతుకుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కరక్‌భాట్ గ్రామంలో టికమ్ కొలియారా అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఛవేశ్వర్ అనే వ్యక్తి తన భార్యకు స్నేహితుడు కావడంతో ఆమెతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. తనని లైంగికంగా వేధిస్తున్నాడని భార్య భర్తకు తెలపడంతో 2003లో చవేశ్వర్‌ను టికమ్ హత్య చేసి అడవిలో పాతిపెట్టాడు.

Also Read: చిత్తూరులో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు

మృతి చెందిన వ్యక్తి ఇప్పుడు తన కలలోకి వచ్చి హింసిస్తున్నాడని గ్రామస్థులకు చెప్పాడు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్లారు. మృతదేహం కనిపించకపోవడంతో కొలియారా మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులకు అతడిని అప్పగించారు. ఛవేశ్వర్ తండ్రి పట్టువిడవకపోవడంతో గత సంవత్సరం నుంచి మృతదేహం కోసం తవ్వకాలు జరిపారు. తాజాగా అస్థిపంజరం బయటపడడంతో డిఎన్‌ఎ పరీక్షల నిమిత్తం ఎముకల ప్రయోగశాలకు పంపించారు. కొన్ని రోజులుగా కొలియారా కనిపించడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News