రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలోడా బజార్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలారి పోలీస్ స్టేషన్ పరిదిలోని గోడా బ్రిడ్జి సమీపంలో 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న వ్యాన్ ను ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు ఒక శిశులు, ఒక మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు, ఎస్‌ఎస్‌పి దీపక్ ఝా తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 20 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కూడా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ట్రాఫిక్‌కు అంతరాయ లేకుంగా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. గత ఫిబ్రవరిలో జంజిగిర్ చంపా జిల్లాలో ట్రాక్టర్-ట్రాలీ డీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 12 మంది గాయపడిన విషయం తెలిసిందే.
Also Read: కర్నాటక కొత్త సిఎం ఎవరో ? ఎంపిక బాధ్యత ఖర్గేకే..