Tuesday, January 7, 2025

ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్, ఒక పోలీస్ మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో ఎదురుకాల్పులు
దాంతెవాడ (ఛత్తీస్‌గఢ్) : ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలో భద్రత బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. ఆ కాల్పుల పోరులో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) హెడ్ కానిస్టేబుల్ కూడా మరణించినట్లు ఆయన తెలియజేశారు. నారాయణ్‌పూర్, దాంతెవాడ జిల్లాల సరిహద్దులో దక్షిణ అబూఝ్‌బాడ్‌లోని ఒక అడవిలో డిఆర్‌జి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సంయుక్త బృందం నక్సలైట్ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు శనివారం సాయంత్రం కాల్పుల పోరు చోటు చేసుకుందని పోలీస్ అధికారి వివరించారు.

శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత కాల్పుల పోరు ఆగినప్పుడు ఆ ప్రదేశంలో నుంచి నలుగురు నక్సలైట్ల మృతదేహాలను, ఎకె47 రైఫిల్, సెల్ప్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్) సహా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. డిఆర్‌జి హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ కూడా ఆ కాల్పుల పోరులో మృతి చెందినట్లు, ఆ ప్రాంతంలో గాలింపు సాగుతున్నట్లు అధికారి తెలిపారు. నారాయణ్‌పూర్, దాంతెవాడ, కొండగాఁవ్, బస్తర్ జిల్లాల నుంచి డిఆర్‌జి బృందాలతో నక్సలైట్ల వ్యతిరేక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. నక్సలైట్ల బెడద నిర్మూలించేందుకు పోరు కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. బస్తర్ ప్రాంతంలో దాంతెవాడ, నారాయణ్‌పూర్ సహా ఏడు జిల్లాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News