Monday, February 10, 2025

అడవిలో తుపాకుల గర్జన… 31 మంది నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

ఇద్దరు జవాన్లూ మృతి హతుల్లో
మావోయిస్టు అగ్రనేతలు? 20 మంది
పురుషులు, 11మంది మహిళలు
ఉన్నట్లు గుర్తింపు నారాయణపూర్
జిల్లా కేంద్రానికి మృతదేహాల
తరలింపు బలగాలపై హోం
మంత్రి అమిత్‌షా ప్రశంసలు వచ్చే
ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని
అంతం చేస్తామని ప్రతిన

బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్) : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్లు)పై చేపట్టిన భారీ కార్యక్రమంలో ఆదివారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకోగా భద్రత బలగాలు 31 మంది నక్సలైట్లను కాల్చిచంపాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు భద్రత సిబ్బంది కూడా మరణించినట్లు, మరి ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇంత వరకు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 81 మంది నక్సలైట్లను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. ఆదివారం ఉదయం నక్సలైట్ల వ్యతిరేక కార్యక్రమంపై వేర్వేరు భద్రత దళాల సంయుక్త బృందం వెళ్లినప్పుడు ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఒక అడవిలో తాజా కాల్పుల పోరు చోటు చేసుకుందని బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి సుందర్ రాజ్ వెల్లడించారు.

‘ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది నక్సలైట్లు హతులయ్యారు’ అని ఆయన తెలిపారు. ఘటన ప్రదేశం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఇద్దరు భద్రత సిబ్బంది రాష్ట్ర పోలీస్ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)కి చెందిన ఒకరు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్)కు చెందిన మరొకరు కూడా ఈ కాల్పుల పోరులో మరణించినట్లు, మరి ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు ఆయన చెప్పారు.

క్షతగాత్రులైన ఇద్దరు జవాన్లకు ప్రాణాపాయం తప్పిందని, వారిని చికిత్స నిమిత్తం మెరుగైన వైద్య కేంద్రానికి హెలికాప్టర్‌లో తరలిస్తున్నారని ఆయన తెలిపారు. అదనపు భద్రత సిబ్బందిని ఆ ప్రదేశానికి హుటాహుటిని తరలించినట్లు, ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లలో మరణించిన 81 మంది నక్సలైట్లలో 65 మంది ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో హతమయ్యారు. నిరుడు ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రత బలగాలు 219 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయని పోలీసులు తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News