Friday, November 22, 2024

కొరడా దెబ్బలు తిన్న సిఎం

- Advertisement -
- Advertisement -

Chhattisgarh CM Bhupesh Baghel gets whipped

రాయపూర్ : జనం, మీడియా చూస్తుండగా చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ వాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దుర్గ్ జిల్లా లోని గౌరిగౌర పూజలో పాల్గొన్న సీఎం, అక్కడి గిరిజన సంప్రదాయం ప్రకారం కొరడాతో కొట్టించుకున్నారు. దీపావళి మరుసటి రోజు ఈ పూజ నిర్వహిస్తుంటారు. చెడును తరిమి కొట్టేందుకు కొరడా దెబ్బలు కొట్టడం ఈ పండగ సంప్రదాయం. రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోసం , విఘ్నాలు తొలగడం కోసం భూపేష్ ఈ పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన చేయి చాపుతూ మణికట్టుపై కొరడా దెబ్బలు కొట్టాలని కోరారు. జనం సమక్షంలో సీఎం కొరడా దెబ్బతిన్నారు. సంప్రదాయానుసారం కొరడా దెబ్బలు కొట్టిన వ్యక్తి ఆ తర్వాత సీఎంకు అభివాదం చేశారు. ఈ గిరిజన సంప్రదాయాన్ని సోట అని పిలుస్తారు. ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సమయంలో కర్రతో చేతిపై కొట్టించుకుంటే దురదృష్టం కనుమరుగవుతుందని నమ్ముతుంటారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మాట్లాడుతూ ఇది అద్భుతమైన సంప్రదాయమని ప్రశంసించారు. కొరడా దెబ్బలు కొట్టే పనిని దుర్గ్‌కు చెందిన సీనియర్ సిటిజన్ భరోసా ఠాకూర్ ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు బీరేంద్ర కుమార్ కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News