Wednesday, November 6, 2024

చత్తీస్‌గఢ్ సిఎం బఘేల్ తండ్రి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Chhattisgarh CM's father arrested
బ్రాహ్మణులను సంస్కరించాలి లేదా ఓల్గాకు పంపాలన్న వ్యాఖ్యలపై దుమారం

రాయ్‌పూర్: బ్రాహ్మణులను అవమానించే వ్యాఖ్యలు చేశారన్న కేసులో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌బఘేల్ తండ్రి నంద్‌కుమార్‌బఘేల్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత ఆయణ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బ్రాహ్మణులను విదేశీయులుగా పేర్కొంటూ నంద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గంవారు రాయ్‌పూర్‌లోని డిడి నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులు బయటివారని, వారిని మనం సంస్కరించాలి.

లేదా గంగా నుంచి ఓల్గాకు పంపాలి అని నంద్‌కుమార్ వ్యాఖ్యానించినట్టు కేసు నమోదైంది. ప్రముఖ బెంగాలీ సాహితీవేత్త రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘ఓల్గా సే గంగా’లో చెప్పినట్టు ఆర్య సంతతి రష్యాలోని ఓల్గా ప్రాంతం నుంచి గంగానదీ పరివాహక ప్రాంతానికి వలస వచ్చిందన్నది చారిత్రక భావన. ఈ నేపథ్యంలో నంద్‌కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనిపై స్పందించిన భూపేశ్‌బఘేల్ చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. ఓ కుమారుడిగా తండ్రిని గౌరవిస్తాను. సామాజిక సామరస్యం దెబ్బతీసేలా ఎవరు వ్యాఖ్యానించినా క్షమించబోం అన్నారు. ముఖ్యమంత్రి 86 ఏళ్ల తండ్రియైనా చట్టానికి లోబడి ఉండాలని హితవు పలికారు. తన ప్రభుత్వం అన్ని కులాలు, మతాల మనోభావాలను గౌరవిస్తుందని భూపేశ్‌బఘేల్ అన్నారు. తనకూ, తన తండ్రికీ రాజకీయ సిద్ధాంతాల్లో విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందేనని భూపేశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News