Sunday, December 22, 2024

చత్తీస్‌గఢ్ డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మాండవి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Chhattisgarh Deputy Speaker Mandavi passes away

రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ , అధికార కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ మనోజ్‌సింగ్ మాండవి (58) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్‌లో శనివారం రాత్రి అస్వస్థతకు గురైనట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆయనను వెంటనే చరమ లోని ఆస్పత్రికి అనంతరం ధామ్‌తరి పట్టణం లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కంకేర్ జిల్లా భానుప్రతాప్‌పూర్ నియోజక వర్గం నుంచి ఎమ్‌ఎల్‌ఎగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాండవి మూడు సార్లు ఎమ్‌ఎల్‌ఎగా గెలిచారు. 2000 2003 వరకు అజిత్‌జోగి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. మాండవి మృతికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బూపేస్ బాగెల్, ఎమ్‌ఎల్‌ఎలు, కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News