Sunday, January 19, 2025

గోతిలో పడిన బస్సు: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీం గ్రామ శివారులో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రైవేటు ఉద్యోగులతో వెళ్తున్న బస్సు గోతిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. డిస్టలరీ కంపెనీకి సంబంధించిన 30 మంది ఉద్యోగులను బస్సులో ఇళ్లకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు డియో దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News