Thursday, January 23, 2025

బావిలో దూకిన భార్యను రక్షించి… రతికి అంగీకరించడంలేదని భార్య మర్మాంగాలపై

- Advertisement -
- Advertisement -

 

రాయ్‌పూర్: బావిలో దూకిన భార్యను భర్త కాపాడి అనంతరం రతికి అంగీకరించడంలేదని భార్య మర్మంగాలపై దాడి చేయడంతో ఆమె చనిపోయిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శంకర్ రామ్, ఆశాభాయ్ అనే దంపతులు సోమవారం రాత్రి పూటుగా మద్యం తాగారు. తనతో రతి చేయాలని భార్యను భర్త బలవంతం పెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి బావిలో దూకింది. వెంటనే భర్త బావిలో దూకిన భార్యను రక్షించాడు. ఇంటికి వచ్చిన తరువాత రతి విషయంలో ఇద్దరు మధ్య మళ్లీ గొడవ జరిగింది. భార్య మర్మాంగాలపై అతడు దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీస్ అధికారి గార్డెన్ జగ్సే పక్రా తెలిపారు.

Also Read: నదిలో మొసలితో పోరాడి భర్తను కాపాడిన భార్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News