Wednesday, January 22, 2025

వదినపై వ్యామోహం… అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఓ మరది వదినపై కన్నేశాడు.. ఆమె లొంగకపోవడంతో పాటు అన్న అడ్డుగా ఉండడంతో మసాజ్ పేరుతో తమ్ముడు అన్న గొంతునులిమి చంపిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కవర్దా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగర్ గ్రామంలో బిర్సు రామ్(33) తన భార్య పిల్లులు, తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రామ్‌కు బీమ్ సాయి అనే తమ్ముడు ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి వదినపై సాయి కన్నేశాడు. ఆమె ఇబ్బందులకు గురి చేయడంతో అన్న తమ్ముడిని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో రామ్‌పై తమ్ముడు పగ పెంచుకున్నాడు. మద్యం పూటుగా తాగి అన్న ఇంటికి వచ్చాడు.

అదే సమయం కోసం తమ్ముడు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. ఒళ్లు, కాళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పడంతో తమ్ముడు మసాజ్ చేస్తానని నమ్మించాడు. మసాజ్ చేస్తూ అన్న గొంతు నులిమి చంపేశాడు. అనారోగ్యంతో అన్న చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించడంతో పాటు అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. అన్న మృతి గురించి తమ్ముడు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అతడిపై బంధువులకు అనుమానాలు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొన తమ్ముడు సాయిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. తాను వదినను ఇష్టపడుతున్నానని, అన్న అడ్డుగా ఉండడంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News