- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కవార్ధా ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహపనీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడడంతో 17 మంది దుర్మరణం చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, ఆరోగ్య సిబ్బంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైగా తెగకు చెందిన వ్యక్తులు బీడీ ఆకుల సేకరించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ 20 అడుగుల లోతులో పడిపోవడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని సమాచారం.
- Advertisement -