Monday, December 23, 2024

ఛత్తీస్‌గఢ్ లో ఓ వ్యక్తి కూతురి మృతదేహాన్ని 10 కి.మీ మోసుకెళ్ళాడు 

- Advertisement -
- Advertisement -

Chattisgarh man carries daughters dead body 10 Km.

అంబికాపూర్(ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఒక వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహాన్ని భుజాలపై మోస్తున్న వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. దీంతో ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియో విచారణకు ఆదేశించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని లఖన్‌పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం బాలిక మృతి చెందగా, శవ వాహనం వచ్చేలోపు ఆమె తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు.

ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ అనారోగ్యంతో ఉన్న తన కుమార్తె సురేఖను తెల్లవారుజామున లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చినట్లు వారు తెలిపారు.

‘అమ్మాయికి ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంది, దాదాపు 60. ఆమె గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. అవసరమైన చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె పరిస్థితి క్షీణించి, ఉదయం 7:30 గంటలకు మరణించింది’ అని ఆరోగ్య కేంద్రంలోని రూరల్ మెడికల్ అసిస్టెంట్ (RMA) డాక్టర్ వినోద్ భార్గవ్ తెలిపారు.  ‘త్వరలో శవ వాహనం వస్తుందని మేము కుటుంబ సభ్యులకు చెప్పాము. అయితే అది ఉదయం 9:20 గంటలకు వచ్చింది, కానీ అప్పటికే వారు మృతదేహం తీసుకు వెళ్లారు’ అన్నారాయన.

వీడియోలో, ఈశ్వర్ దాస్ మృతదేహాన్ని తన భుజాలపై మోస్తున్నట్లు చూడవచ్చు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి తన ఇంటికి చేరుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News