Friday, December 20, 2024

ప్రియురాలిని వేధించాడని ప్రిన్సిపాల్ హత్య

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ న్యూస్: ప్రియురాలిని వేధించాడని ప్రిన్సిపాల్‌ను ప్రియుడు హత్య చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉపేంద్ర కౌశిక్, ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. పాఠశాలలో సదరు యువతిని ప్రిన్సిపాల్ ప్రదీప్(61) వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం ప్రియురాలు ప్రియుడికి చెప్పింది. గురువారం రాత్రి ఇంటికి వెళ్తున్న ప్రదీప్‌ను అతడు వెంబడించాడు. అతడి ఇంటి గేటు వద్దకు రాగానే ప్రదీప్‌తో కౌశిక్ గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో సుత్తి తీసుకొని పలుమార్లు ప్రిన్సిపాల్ తలపై ప్రియుడు బాదాడు. ఘటనా స్థలంలోనే ప్రదీప్ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News