Thursday, January 23, 2025

యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టి…. ప్రియుడు ఆత్మాహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: పెళ్లి చేసుకోవడం లేదని యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనంతరం తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఖామ్‌తరయ్‌లోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో పూర్వి ఝా(22) అనే యువతి సెక్యూర్టీ ఏజెన్సీలో ఎకౌంటెంట్‌గా పని చేస్తుంది. ఆమెకు జీవన్ దూబే(25) అనే స్నేహితుడు ఉన్నాడు. జీవన్ ఆమెను పలుమార్లు పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆమె తిరస్కరించింది. ఆమె పని చేస్తున్న ఆఫీస్‌కు వెళ్లి పెళ్లి చేసుకోవాలని బతిమాలాడు. ఆమె మాత్ర తిరస్కరించడంతో పెట్రోల్ ఆమెపై పోసి తగలబెట్టాడు. అనంతరం తనపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పేసి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: ప్రయోగశాలగా ప్రార్థనా స్థలం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News