రాయ్‌పూర్: 17 ఏళ్ల బాలిక నాలుక కోసి శివ లింగానికి సమర్పించుకున్న అనంతరం ఆమె ధ్యానంలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దభ్రా ప్రాంతంలోని దేవరఘటా గ్రామంలో 17 ఏళ్ల బాలిక శివుడి గుడిలోకి వెళ్లింది. శివ లింగ ముందు కూర్చొని నాలుగు కోసి సమర్పించుకుంది. లోపల నుంచి దేవాలయానికి గడియ పెట్టుకొని ధ్యానం చేస్తున్నానని.. తనకు భంగం కలిగించొద్దని ప్రజలకు సమాచారం ఇచ్చింది. ఆ బాలికకు గ్రామస్థులు, తల్లిదండ్రులు మద్దతు పలికారు.
ఎవరైనా తన ధ్యానానికి భంగం కలిగిస్తే గ్రామంలో హత్య జరుగుతుందని తెలిపింది. దీంతో గ్రామస్థులు ఎవరు ఆ దేవాలయంలోని వెళ్లనివ్వడం లేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అధికారులు దేవాలయం వద్దకు చేరుకొని బాలిక ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆమె ప్రస్తుతం భోజనం తింటుందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. బాలిక దైవభక్తి పిచ్చి పీక్ స్టేజీకి చేరిందని నెటిజన్లు మండిపడుతున్నారు. బాలికతో పాటు గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.