Sunday, January 19, 2025

రాఖీ కట్టి వస్తున్న అక్క చెల్లెలుపై పది మంది అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: సోదరులకు రాఖీ కట్టి వస్తున్న అక్క చెల్లెలుపై పది మంది అత్యాచారం చేయడం పాటు వాళ్లకు తోడుగా ఉన్న ఒకరికి కాబోయే భర్తపై దాడి చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఇద్దరు అక్కచెల్లెలు, అక్కకు కాబోయే భర్తతో కలిసి తన సోదరులకు రాఖీలు కట్టడానికి వెళ్లారు. ముగ్గురు కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా వారిపై ముగ్గురు దుండగులు దాడి చేసి నగదు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. అదే సమయంలో నాలుగు బైక్‌లపై ఏడుగురు వచ్చి అక్కాచెల్లెలుతో ఉన్న వ్యక్తిపై దాడి చేసి వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం వారిపై పది మంది సామూహికంగా అత్యాచారం చేసిన అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. ముగ్గురు కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పది మంది నిందితులలో ఒకరు బిజెపి లీడర్ లక్ష్మీనారాయణ సింగ్ కుమారుడు పూనమ్ టాకూర్ ఉన్నాడు. పూనమ్ టాకూర్ అనే వ్యక్తి గత నెలలో జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు వెల్లడించారు.

Also Read: యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్‌కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News