Monday, December 23, 2024

గిరిజనుల ఉనికికి “ఉమ్మడి సివిల్ కోడ్‌” ముప్పు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఉమ్మడి సివిల్ కోడ్ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తొందరపాటు తగదని, గిరిజనులకు తమ సమాజాన్ని నిర్వహించుకోడానికి స్వంత ఆచార నియమాలు ఉన్నందున , ఈ ఉమ్మడి సివిల్ కోడ్ గిరిజన ఉనికికి ముప్పు కలిగిస్తుందని చత్తీస్‌గఢ్ సర్వ ఆదివాసీ సమాజ్ (సిఎస్‌ఎఎస్) స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గిరిజన తెగలన్నిటికీ ఈ సమాజ్ రక్షణగా ఉంటోంది. సిఎస్‌ఎఎస్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి అరవింద్ నేతమ్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తమ సంస్థ ఉమ్మడి సివిల్ కోడ్‌కు పూర్తిగా అభ్యంతరం తెల్పడం లేదని, కానీ కేంద్రం దీన్ని అమలు లోకి తెచ్చే ముందు ప్రతివారిని విశ్వాసం లోకి తీసుకోవాలని సూచించారు.

గిరిజన సమాజంలో ఉమ్మడి సివిల్‌కోడ్ అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. లా కమిషన్ ఉమ్మడిసివిల్ కోడ్ అమలుకు సంబంధించి సూచనలను కోరడంతో చత్తీస్‌గఢ్ లోని గిరిజన సమాజాలు తమ స్వంత ఆచార నియమాలను దృష్టిలో పెట్టుకుని తమ అభిప్రాయాలను అందజేశాయని నేతమ్ చెప్పారు. గిరిజన సమాజంలో నిబంధనలను కొన్ని వివరిస్తూ మహిళ తన అధికారిక భర్త విడిచిపెట్టిన తరువాత అనేకసార్లు వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉందని, అయితే వారికి పూర్వికుల భూమిని పొందే హక్కు ఉండదని నేతమ్ ఉదహరించారు. ఈ సంప్రదాయ గిరిజన చట్టం రాజ్యాంగం లో (ఆర్టికల్ 13(3)(ఎ)లో పొందుపరిచారని ఉదహరించారు.ఇలాంటివాటికి ఉమ్మడి సివిల్ కోడ్ ప్రతిబంధకమౌతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News