Wednesday, December 25, 2024

పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంజనీర్ మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గఢ్ జిల్లాలో జరిగింది. దిలిప్ రాజకౌర్ అనే వ్యక్తి బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. డోంగర్‌గఢ్‌లో తన మేనకోడలు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహం జరిగిన తరువాత తన బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. సడన్‌గా అస్వస్థతకు గురికావడంతో కింద కూర్చున్నాడు. కుర్చున్న రెండు 30 సెకండ్లలో వెనకకు పడిపోయాడు. వెంటనే బంధువులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదని ఉన్నంతకాలం సంతోషంగా బతకాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే. చిన్న పిల్లలకు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News