- Advertisement -
దోహా: భారత ఫుట్‌బాల్ స్టార్ సునిల్ ఛెత్రి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీని వెనక్కి నెట్టి అరుదైన ఘనతను నెలకొల్పాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా ఛెత్రి చరిత్ర సృష్టించాడు. 74 గోల్స్‌తో అత్యధిక గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా ఛెత్రి నిలిచాడు. ఇదే సమయంలో మెస్సీని సయితం వెనక్కినెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డొ (103) గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్ 2022, ఎఎఎఫ్‌సి ఆసియా కప్ 2023కు సంయుక్తంగా జరిగిన ప్రిలిమినరీ అర్హత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఛెత్రి చేసిన చారిత్రక గోల్‌తో భారత్ చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది.
- Advertisement -