Saturday, December 21, 2024

ఢిల్లీ-చికాగో విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

బాంబు బెదిరింపు దరిమిలా ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్న ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. మంగళవారం ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్న ఎఐ127 విమానాన్ని ఆన్‌లైన్‌లో వచ్చిన భద్రతా ముప్పు కారణంగా ముందు జాగ్రత్త చర్యగా కెనాడలోని ఇకలుయిట్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు ఆ అదికారి చెప్పారు. సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం ప్రయాణికులందరినీ మరోసారి తనిఖీలు చేసినట్లు ఆయన చెప్పారు. విమానంలో అనుమానాస్పద వస్తువేదీ లభించలేదని ఆయన వివరించారు.

కాగా..సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానాన్ని బాంబు బెదిరింపు కారణంగా ఢిల్లీకి మళించారు. ఇటీవలి రోజులలో తమ ఎయిర్‌లైన్స్‌తోపాటు ఇతర ఎయిర్‌లైన్స్‌కు కూడా బాంబు బెదిరింపులు తరచు వస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ బెదిరంపులన్నీ బూటకపు బెదిరింపులేనని తర్వాత తేలినప్పటికీ బాధ్యతగల ఎయిర్‌లైన్స్‌గా తాము వీటిని బేఖాతారు చేయలేమని తెలిపింది. ఈ బెదిరింపులకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిగిన నష్టానికి పరిహారాన్ని వసూలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News