Thursday, January 23, 2025

కొండ దిగుతున్న కోడి.. కిలో రూ.185

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వర్షాకాలం ప్రారంభమైంది. వాతావరణం చల్లబడింది. మార్కెట్లో మొన్నటిదాక కొండెక్కి కూర్చు కోడి మాంసం ధరలు మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో బ్రాయిలర్ కోడి మాంసం స్కిన్‌లెస్ కిలో రూ.185, బోన్‌లెస్ 240, లైవ్ 110 చొప్పున విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది వేసవిలో కోడిమాంసం ధరలు అనూహ్యంగా పెరుగుతూ పోయాయి. మే నెలలో ఎండలు సెగలు చిమ్మాయి. ఉష్ణోగ్రతలు 40నుంచి 45 డిగ్రీల మధ్యన కొనసాగుతూ రావటంతో అధిక ఉష్ణోగ్రతలను భరించలేక కోళ్లు విలవిలలాడిపోయాయి. ప్రతికూల పరిస్థితుల మధ్యన షెడ్లలో చల్లదనం పెంచేందుకు చుట్టూ పట్టాలు కట్టి రెండు గంగలకు ఒకసారి నీటితో తడపడం, ప్యాన్లు కూలర్లు ,ఏసిలు పెట్టి కోళ్లను కాపాడుకుంటూ వచ్చారు. నిర్వహణ వ్యయం పెరగటంతో కోళ్ల ధరను కూడా పెంచివేశారు. అంతే కాకుండా వేసవిలో కోళ్ల యూనిట్లను కూడా తగ్గించివేశారు. మార్కెట్లోకి కోళ్ల రవాణా తగ్గిపోయింది.దీంతో ఏప్రిల్ నుంచి జూన్ చివరిదాక రాష్ట్రంలో కోడి మాంసం ధరలు భగ్గు మంటూ వచ్చాయి. రికార్డు స్థాయిలో కిలో బ్రాయిలర్ మాంసం ఏకంగా రూ.300కు పెరిగిపోయి వినియోగదారులకు చుక్కుల చూపింది.

జులై ప్రారంభం నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తుండటం వాతావరణం చల్లబడటంతో కోడి మాంసం ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. జూన్ మొదటి వారంలో ప్రారంభించిన కొత్త యూనిట్లలోని కోళ్లు కూడా కటింగ్‌కు అందుబాటులోకి వస్తున్నాయి.దీంతో సహజంగానే మార్కెట్లోకి కోళ్ల రవాణ పెరిగింది. క్రమేపి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. మరో వారం రోజుల్లో కోడి ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కోడి మాంసం విక్రయాలు కూడా పుంజుకున్నాయని చికెన్ సెంటర్ల నిర్వహాకులు చెబుతున్నారు. గత పది రోజులుగా విక్రయాల్లో 30శాతం పెరుగుదల ఉన్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News