Monday, January 20, 2025

చికెన్ ప్రియులకు షాక్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: చికెన్ ప్రియులకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. చికెన్ మాంసం ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో మాంసాహారా ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. మటన్‌తో పోల్చితే చికెన్ ధరలు చాల తక్కువ కావడంతో సామాన్య ప్రజలు అధికంగా చికెన్ వైపే మొగ్గు చూపుతుంటారు. అంతేకాకుండా చికెన్‌తో విభిన్న రకాల వంటకాలను అతి సులభంగా చేసుకునే అవకాశం ఉండడంతో ఇంట్లో శుభకార్యం మొదలు చుట్టం వచ్చినా ఎక్కువగా కొడి మాంసాన్నే కొంటుంటారు. అయితే ఇటీవల వరకు 250 నుంచి 280 మధ్య ఉన్న కిలో చికెన్ ధర శనివారం ఏకంగా (స్కిన్‌లెస్) రూ.318 నుంచి రూ.330లు, (స్కిన్) రూ.285లకు పెరిగింది. ఇలా చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పడే ఇంత ధర ఉంటే నేడు ఆదివారం కావడంతో రేట్ మరింత పెరుగుతుందోనని చికెన్ ప్రియులు హడలిపోతున్నారు. వర్షకాలం, చలి కాలంలో చికెన్ కిలో ధర సాధారణంగా రూ.150 నుంచి 200 లోపే ఉంటుంది. అయితే ఎండకాలంలో మాత్రంరూ. 200 నుంచి రూ. 250 వరకు పెరగడం సహాజం. ఎందుకంటే ఎండకాలంలో వేడిమి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగుతుండగా, మరోవైపు ఈ కాలం పెళ్లీల సీజన్ కావడంతో డిమాండ్ మరింత పెరుగుతుంది. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో దీనిని అవకాశంగా తీసుకుని వ్యాపారులు ఒక్కసారిగా ధరలను పెంచివేస్తున్నారు. అయితే ప్రతి ఎండకాలంలో మే నెలలో చికెన్ ధరలు కొంత మేర పెరుగుతుండగా ఈసారి మాత్రం జూన్ రెండవవారంలో చికెన్ ధరలు పెరిగాయి.

ఇందుకు కారణంగా ఈ సారి ఏప్రిల్‌లో పెద్దగా ఎండలు లేకపోవడం, కోళ్ల ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం పడలేదు.. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు ఉత్పత్తి మధ్య సమతుల్యం కొనసాగడంతో మే నెల మొత్తం దాదాపుగా కిలో చికెన్ ధర రూ.250 నుంచి రూ.280 మధ్య అటు ఇటుగా కొనసాగింది. ఇదేక్రమంలో మే రెండవవారంలో తర్వాత క్రమక్రమంగా ఎండలు తీవ్రత పెరుగడంతో ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి పడిపోయింది. ఆ ప్రభావంతో జూన్ రెండవారం నాటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు మేర సరఫరా తగ్గిపోవడంతో ఒక్కసారిగా చికెన్ ధరలు అకాశాన్నంటాయి.
రోజు వారిగా 6లక్షల నుంచి 9లక్షల కిలోల వినియోగం ః
రాష్ట్రంలో ఆదివారం మినహాయించి రోజు వారిగా రాష్ట్రంలో 6 లక్షల నుంచి 9లక్షల కిలోల చికెన్ మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. అదే గ్రేటర్ హైదరాబాద్‌లో అయితే 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల మధ్య ఉంటుంది. ఆదివారం అయితే గ్రేటర్‌లో చికెన్ అమ్మకాలు రెట్టింతలు పెరుగుతుంటాయి. ఇదేక్రమంలో జూన్ రెండవ వారం వరకు సైతం నగరంలో పెళ్లిలతో పాటు వివిధ శుభ్యకార్యాలు సైతం అధికంగా ఉండడంతో చికెన్‌ను మరింత డిమాండ్ ఏర్పడడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News