Thursday, December 19, 2024

చికెన్..జనం వణికెన్!

- Advertisement -
- Advertisement -

కిలో రూ.320కి చేరిన ధరలు
మూడు వారాల్లోనే
రూ.120అధికం
15శాతం తగ్గిన వినియోగం

మన తెలంగాణ/హైదరాబాద్ : కోళ్లపరిశ్రమరం గానికి వడదెబ్బ తగిలింది. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన ఉష్ణోగ్రతలతో కోళ్లు గిలగిల కొ ట్టుకుంటున్నాయి. ఎండల తీవ్రత నుంచి కోళ్లను కాపాడుకోవటం వాటి పెంపకం దారులకు తలకు మించిన భారంగా మారింది. ఉత్పత్తి తగ్గటం మ రో వైపు మార్కెట్‌లో సరఫరాలోటు చికెన్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కిలో కోడిమాంసం స్కిన్ రూ.200,రూ. స్కిన్‌లెస్ రూ.320కి పెరిగిపోయాయి. రంజాన్ మాసం కూడా కోడిమాంసం ధ రల పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు. మార్చి చివరి వారంలో కిలో కోడి మాంసం స్కిన్‌లెస్ 190రూపాయలుగా ఉండేది.

కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రూ.120 అధికంగా పెరిగిపోయింది. మార్కెట్‌కు వస్తున్న కోళ్లలో అత్యధికశాతం ఫంక్షన్లకు , హలీం తయారీకే వినియో గం అవుతున్నాయి. సాధారణ ప్రజానీకం కోడి మాంసం ధరల పెరుగుదలను చూసి పెదవి విరుస్తున్నారు. మాంసం కోసం చికెన్‌షాపుల వరకూ వచ్చిన వారిలో పెరిగిన ధరలు చూసి చికెన్ కొనకుండానే 15శాతం మంది వెనుదిరిగిపోతున్నట్టు అమీర్‌పేటలోని చికెన్ సెంటర్ వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రభావంతో చికెన్ మార్కెట్‌లో సేల్స్ పెరిగినప్పటికీ సాధారణ వినియోగదారలు నుంచి కొనుగోలు 30శాతం వరకూ తగ్గింది. రెండు కిలోలు కొనుగోలు చేసే వారు ఒకటిన్నర కిలో మాంసంతోనే సరిపెడుతున్నారు.

పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా తెలంగాణ నుంచి కోళ్లు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్‌లో చికెన్ ధరల పెరుగుదలకు ఇది కూడా కొంత కారణం అని చెబుతున్నారు.వేసవి ఎండల తీవ్రత నుంచి ఫౌల్ట్రీరంగం మనుగడ కొనసాగించాలంటే కూలర్లు ఉంటేనే కోళ్లు బతికి బట్టకట్టగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. కోళ్లఫాంల చుట్టు గోనెసంచులు కట్టి గంటకు ఒకసారి వాటిని నీటితో తడుపుతున్నా చల్లదనం చాలటం లేదంటున్నారు. మరికొందరు ఫాం లోపేలే కూలర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏసిలు పెట్టిన పెంపకం దారుల కూడా లేకపోలేదు. రాష్ట్రంలో గత పది రోజులుగా ఉష్ణోగ్రతు 40 డిగ్రీల నుంచి గరిష్టంగా 44.5డిగ్రీలకు పెరిగిపోయాయి.

సాధారణంగా ఉండాల్సిన వేసవి ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
మరోవైపు వడగాల్పులు కూడా ఫౌల్ట్రీరంగాన్ని మరింత కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న కోళ్లను కాపాడుకోవటం శక్తికి మించిన పనవుతోంది. ఫాంల నిర్వహణ ఖర్చులు సాధారణం కంటే 20నుంచి 30శాతం పెరిగిపోతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడితే కోడి మాంసం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News