Wednesday, January 22, 2025

బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న చికెన్

- Advertisement -
- Advertisement -

మాంస ప్రియులకు బ్యాడ్ న్యూస్.. చికెన్ తినాలనుకునే వారు ఇక నుంచి అలోచించాల్సిందే. కొద్ది రోజులుగా తగ్గుకుంటూ వచ్చిన చికెన్ ధరలు ప్రస్తుతం మళ్లీ పరుగులు పెడుగుతన్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర భారీగా పెరుగుతోంది. ఇటీవల 180 రూపాయల లోపే ఉన్న కేజీ చికెన్ ధర.. ఇప్పుడు 250 రూపాయలకు చేరుకుంది. గత వారం కేజీ చికెన్ ధర రూ.200 నుంచి రూ.230 వరకు పలికింది.

ప్రస్తుతం కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.240గా ఉంది. విత్ స్కిన్ చికెన్ 213 రూపాయలకు చేరింది. దీంతో సామాన్య జనాలు చికెన్ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. అయితే, దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News