Monday, April 7, 2025

తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతుందంటే?

- Advertisement -
- Advertisement -

నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో చికెన్ రేట్లు తగ్గాయి. ఉగాది వరకు కేజీ చికెన్ రూ.300 వరకు ఉండగా.. తాజాగా ధరలు దిగొచ్చాయి. అయితే, రాష్ట్రంలో ఒక్కో చోటు ఒక్కో ధర ఉంది. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో కిలో చికెన్ ధర 160 నుండి 200 రూపాయల మధ్యలో ఉంది. స్కిన్‌లెస్ చికెన్ రూ.200 నుండి రూ. 210గా ఉంది. ఇక, బోన్‌లెస్ చికెన్ రూ. 220గా ఉంది.

ఇక, ఆదిలాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర 160 నుండి 180 రూపాయల వరకు ఉంది. ఖమ్మంలో 150 నుండి 170 రూపాయల మధ్యలో ఉంది. అయితే, చికెన్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ వ్యాపించడమేనని పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యం చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల ఇటీవల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దాని ఎఫెక్ట్ కోళ్ల గిరాకీపై పడిందని.. భారీగా ఆస్థి నష్టం జరిగిందని పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News