Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లో చికెన్ ధర రికార్డు స్థాయిలో ఉంది. సాధారణంగా, వేసవిలో చికెన్ ధరలు తగ్గుతుంటాయి. ఎందుకంటే కోళ్లు తీవ్రమైన వేడి, ఉష్ణోగ్రత కారణంగా చనిపోతాయి. దీంతో చికెన్ సరఫరా సరిగా ఉండదు. వేసవి అంటే పెళ్లిళ్ల సీజన్, ఫంక్షన్ల కారణంగా చికెన్‌కు డిమాండ్ పెరిగింది.

రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ. 310. స్లమ్ ఏరియాల్లో ధర ఎక్కువగా ఉంటుంది. తొక్కతో కూడిన చికెన్ రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. గత రెండు వారాలుగా ధరలు మారుతూ వస్తున్నాయి. రోజుకు సగటున 5 లక్షల నుంచి 7 లక్షల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతున్నాయి. గత ఆదివారం హైదరాబాద్‌లో 50 లక్షల కిలోల చికెన్ విక్రయించినట్లు చికెన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News