Sunday, December 22, 2024

మాంసం ప్రియులకు శుభవార్త…

- Advertisement -
- Advertisement -

మాంసం ప్రియులకు శుభవార్త.. కార్తీకమాసం తర్వాత తెలంగాణలో కొండెక్కిన చికెన్ ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. న్యూఇయర్ సమయంలో చికెన్ కిలో చికెన్ ధర రూ.205 నుంచి రూ.260 వరకు పలికింది. తాజాగా రూ.100 రూపాయల మేర చికెన్ ధర తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన ధరల ప్రకారం.. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.150 నంచి రూ.160కు లభిస్తుండగా.. విత్ స్కిన్ రూ.120గా ఉంది. డిమాండ్ కంటే సప్లయ్ ఎక్కువగా ఉండటంతో ధర తగ్గినట్లు తెలుస్తోంది.

మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండడంతో మళ్లీ చికెన్ ధరలకు రెక్కలు రావొచ్చనే అంచనా వేస్తున్నారు వ్యాపారులు. ఇటీవల కోడి గుడ్డు ధర కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.7లు పలుకుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News