Monday, December 23, 2024

చికెన్ కు కార్తీకమాసం ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

అన్ని మాసాలలోకీ కార్తీక మాసానికి చాలా విశిష్ఠత ఉంది. కార్తీక మాసంలో భక్తులు చాలా భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో దైవారాధన చేస్తారు. కార్తీక సోమవారాలలో ఉపవాసాలు ఉండటం రివాజు. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేస్తారు. అన్నింటికీ మించి, మద్యమాంసాలకు దూరంగా ఉంటారు. అయితే భక్తుల ఆచారాల పుణ్యమాని, చికెన్ రేట్లు పడిపోయాయని చికెన్ విక్రేతలు గగ్గోలు పెడుతున్నారు.

కార్తీకమాసం కారణంగా చికెన్, మటన్ కొనేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. కార్తీకమాసానికి ముందు కిలో రూ.300 ఉన్న చికెన్ ధర, ఇప్పుడు సగానికి పడిపోయింది. కిలో చికెన్ ధర రూ. 150 ఉంటే, స్కిన్ లెస్ చికెన్ ధర 172 రూపాయలు ఉంది. ఈ నెల రోజులూ మార్కెట్ ఇలాగే ఉంటుందని, కార్తీక మాసం గడిస్తేనే గానీ ధరలు ఊపందుకోవలని ఒక చికెన్ షాపు నిర్వాహకుడు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News