Monday, December 23, 2024

చికెన్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి

- Advertisement -
- Advertisement -

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. పెళ్లిళ్ళ సీజన్ మొదలు కావడంతో చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం ముగియడం కూడా ఇందుకు కారణమే. దీంతో మాంసాహారులు లబోదిబోమంటున్నారు.

కార్తీక మాసంలో మాంసం ముట్టని లక్షలాది మంది భక్తుల పుణ్యమాని చికెన్ ధరలు దిగివచ్చాయి. కానీ కార్తీక మాసం ముగియడంతోపాటు జోరుగా పెళ్లిళ్ళు మొదలవడటంతో మళ్లీ చికెన్ ధరలు పెరుగుతున్నాయి. డిసెంబర్ రెండోవారంలో 97 రూపాయలున్న కిలో లైవ్ చికెన్ ధర 122కి పెరిగింది. స్కిన్డ్ చికెన్ ధర 141 నుంచి 177 రూపాయలకు, స్కిన్ లెస్ చికెన్ రేటు 160నుంచి 201 రూపాయలకు, కిలో బోన్ లెస్ చికెన్ ధర 300నుంచి 360 రూపాయలకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News