- Advertisement -
తెలంగాణలో మళ్లీ చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ భయంతో మాంసం ప్రియులు.. చికెన్ కు దూరంగా ఉండటంతో ఒక్కసారిగా చికెన్ ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో తమకు భారీగా ఆస్థి నష్టం జరిగిందని పౌల్ట్రీ ఫామ్ యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, క్రమంగా బర్డ్ ఫ్లూ భయంతో వీడుతుండటంతో మళ్లీ చికెన్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా చికెన్ ధర స్వల్పంగా పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం కేజీ చికెన్ ధర 250 రూపాయల నుంచి 27 రూపాయల వరకు పలుకుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. కాగా గత రెండు వారాల క్రితం కేజీ చికెన్ ధర రూ.230 కంటే తక్కవగానే ఉండేది.
- Advertisement -