Monday, December 23, 2024

చిదంబరం తెలంగాణ చరిత్రను వక్రీకరించారు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ఆమరణ దీక్ష చేయకపోతే
తెలంగాణ ప్రకటన చేసేవారా?
రాజకీయ దురుద్దేశ్యంతో చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారు
బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నేత పి.చిదంబరం తెలంగాణ చరిత్రను వక్రీకరించారని బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఆమరణ దీక్ష చేయకపోతే చిదంబరం తెలంగాణ ప్రకటన చేసేవారా..? అని నిలదీశారు. తెలంగాణ ప్రకటనను చిదంబరం వెనక్కి తీసుకున్నందువల్లే యువకులు బలిదానం చేసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ, సిఎం కెసిఆర్‌ను ఉద్దేశించి చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

చిదంబరం జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళలేరా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి..?, ఇప్పుడు ఎన్ని ఖాళీ ఉన్నాయి..? అని అడిగారు. ఆనాడు లక్ష 95 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. రాజకీయ దురుద్దేశ్యంతో చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగానికి లోబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందని వివరించారు.

అప్పుల్లో అరుణాచల్ ప్రదేశ్ ఒకటో స్థానంలో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు దమ్ముంటే రాజస్థాన్ అప్పుల మీద మాట్లాడాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసే రాష్ట్రంలో మన రాష్ట్రం 22వ స్థానంలో ఉందని చెప్పారు.ఈ దేశంలో 2004 నుంచి 2014 వరకు 2 లక్షల 20 వేల కోట్లు మాఫీ చేసిందని, కానీ 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ 1000 మందికి 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారని తెలిపారు. కేంద్రం ఎన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకుందని అడిగారు. అప్పులు చేయకుండా, భూములు అమ్మకుండా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీంలు అమలు చేయగలదా..? ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలు అమలు కావు అని, ప్రజలు చెంపదెబ్బ కొట్టి, మళ్ళీ కెసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News