Monday, December 23, 2024

మణిపూర్ సమస్యలో అస్సాం సిఎం జోక్యం చేసుకోవద్దు: చిదంబరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండ సమస్యలో అస్సాం ముఖ్యమంత్రి , బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ తలదూర్చకుండా ఉంటేనే మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఏడు , పది రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుందని అస్సా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో ఆయన జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచి జరుగుతుందని చిదంబరం వ్యాఖ్యానించారు. మణిపూర్ సిఎం బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని,

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొన్ని నెలల పాటు విధించితే పరిస్థితి మెరుగుపడుతుందని చిదంబరం పేర్కొన్నారు. అస్సాం సిఎం హిమంత బిశ్వశర్మ శనివారం మాట్లాడుతూ పొరుగునున్న మణిపూర్‌లో రోజురోజుకూ పరిస్థితి మెరుగుపడుతోందని, వారం, పది రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తాను అభిప్రాయ పడుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News