Friday, December 27, 2024

రూ.2 వేల నోట్ల ఉపసంహరణ అనాలోచిత నిర్ణయం: చిదంబరం

- Advertisement -
- Advertisement -

ముంబయి: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాయి. శుక్రవారం రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో విపక్షాలు స్పందిస్తూ ప్రధాని మోడీ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ప్రధాని మోడీవి అనాలోచిత నిర్ణయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. నోట్ల రద్దు మూర్ఖ నిర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకే రూ.2వేల నోట్ల ఉపసంహరణ అంటూ ప్రధాని మోడీని విమర్శించారు.

కాగా, వినియోగదారులకు రూ.2 వేల నోట్లను ఇవ్వొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. రూ.2 వేల నోట్లు ఉన్న వారు ఈ నెల 23నుంచి సెప్టెంబర్ 30 లోగా బ్యాంకులు, ఆర్‌బిఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని తెలియజేసింది. అయితే ఒక విడతలో గరిష్ఠంగా రూ.20 వేలను మాత్రమే మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు పరిమితిని మాత్రం ఆర్‌బిఐ పేర్కొనలేదు.నల్లధనాన్ని దాచుకునేందుకు ఈ పెద్ద నోటును ఉపయోగించుకుంటున్నారన్నఅనుమానాల నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News