Monday, January 20, 2025

మా ప్రశ్నలకు బదులేది? ఆర్థిక మంత్రికి చిదంబరం సూటి ప్రశ్న

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉందని చెపుతున్నారు తప్పితే తమ మూడు ప్రశ్నలకు కిమ్మనలేదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం విమర్శించారు. రాజ్యసభలో గురువారం ఆర్థిక మంత్రి దేశ ఆర్థిక పరిస్థితిపై చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత అయిన చిదంబరం తప్పుపట్టారు. తాను మూడు ప్రశ్నలు లేవనెత్తానని తెలిపారు. గడిచిన పది సంవత్సరాలలో జిడిపి నిజంగానే రూ 200 లక్షల కోట్ల స్థాయికి చేరిందా? దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. కాగా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ నివేదిక ప్రకారం దేశంలోని బాలలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. మరో వైపు ఆహార వృధా శాతం పెరుగుతోంది. దీనికి కారణం ఏమిటీ? ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు గృహాల ఆర్థిక విలువలు అసాధారణంగా 5.1 శాతానికి పడిపొయ్యాయి? వీటికి మంత్రి నుంచి సరైన సమాధానాలు రాలేదని చిదంబరం విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News