Friday, December 20, 2024

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ

- Advertisement -
- Advertisement -

Chief Electoral Officer Shashank Goyal transferred

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ.. సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి శశాంక్ రాష్ట్రంలో వివిధ హోదాలలో సేవలందించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న ఆయన కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. మొత్తం 13 మంది అదనపు కార్యదర్శి స్థాయి అధికారులను బదిలీచేయగా అందులో శశాంక్ గోయల్ ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన వీఎల్ కాంతారావు టెలీకమ్యూనికేషన్స్ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News