Sunday, November 3, 2024

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రమణ?

- Advertisement -
- Advertisement -

Chief Justice of India SA Bobde recommends Justice NV Ramana

ఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ సిజెఐగా జస్టిస్ ఎన్‌వి రమణ పేరును సిపారుసు చేశారు. జస్టిస్ ఎన్‌వి రమణ పేరును సిజెఐ బోబ్డే ప్రతిపాదించారు. కేంద్ర న్యాయ శాఖకు బోబ్డే లేఖ రాశారు. ఏప్రిల్ 2౩న సిజెఐ శరద్ అర్వింద్ బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్‌కే చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ప‌ద‌వి దక్కుతుంది. 2017, ఫిబ్ర‌వ‌రి 14 నుంచి ర‌మ‌ణ సుప్రీంకోర్టు జ‌డ్జిగా పని చేస్తున్నారు. గతంలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తో పాటు  ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేసిన అనుభవం రమణకు ఉంది. కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News