Thursday, January 23, 2025

స్వామివారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సేవలో రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం కొండపైకి చేరుకున్న చీప్ జస్టిస్‌కు ఉత్తర ద్వారం వద్ద స్వస్తి వాచనంతో ప్రధానార్చకులు నల్లన్థీఘల్ లక్ష్మీ నరసింహ చార్యులు ఘన స్వాగతం పలికారు. ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

నేరుగా స్వయంభూ గర్భాలయనికి చేరుకుని నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చక బృందం చతుర్వేద మహా ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో గీత స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ఆలేరు న్యాయమూర్తి సుమలత, భువనగిరి న్యాయమూర్తి , జిల్లా కలెక్టర్, డీసీపీ, ఏసీపీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News