Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి  నాపై దాడి చేయించారు: గవర్నర్ ఆక్రోశం

- Advertisement -
- Advertisement -

కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనపై దాడికి ముఖ్యమంత్రి విజయన్ ప్రయత్నించారని గవర్నర్ ఆరోపించడంతో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.

తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తున్న గవర్నర్ వాహనాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తల వాహనం ఢీకొంది. దీనిపై విజయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సంఘటన వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి కాన్వాయ్ కే ఇలాంటి సంఘటన ఎదురైతే సహిస్తారా? ముఖ్యమంత్రి కారు సమీపంలోకి ఎవరి కారునైనా రానిస్తారా? కానీ నా వాహనానికి మాత్రం ఆటంకాలు సృష్టించారు. నా కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొన్నారు. ముఖ్యమంత్రి నాతో విభేదించవచ్చు కానీ, ఇలా దాడికి పాల్పడటం భావ్యం కాదు’ అని అన్నారు.

ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ ‘కేరళలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. రాజ్ భవన్ నుంచి విమానాశ్రయం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ గవర్నర్ ఐదు కిలోమీటర్లు ప్రయాణించేలోగా ఆయనపై రెండుసార్లు దాడి జరిగింది. దాడికి దిగినవారిని పోలీసులు వదిలేశారు’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News