Friday, October 18, 2024

టిఎస్ ఆర్టీసికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి కృషి

- Advertisement -
- Advertisement -
త్వరలోనే భీంగల్ బస్‌డిపోను పునః ప్రారంభిస్తాం
ఆర్టీసి చైర్మన్, శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని -ఆర్టీసి చైర్మన్, శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మంత్రి వేములతో కలిసి భీంగల్ బస్‌డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ భీంగల్ బస్‌డిపోను పున: ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 2006లో మూసివేసిన ఈ బస్ డిపో కోసం రూ. 2 కోట్ల 50 లక్షల నిధులతో పనులను చేపట్టాలని నిర్ణయించామని, త్వరలోనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో ఈ డిపోను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఆర్టీసిలో మొత్తం 49 వేల సిబ్బంది ఉన్నారని, డ్రైవర్లు కండక్టర్లు డిపో సిబ్బంది ఆఫీసర్లు ఆర్‌ఎంలు, డిఎంలు సంస్థ కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నారన్నారు. ప్రయాణికుల కోసం నూతన బస్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. చైర్మన్ వెంట టిఎస్ ఆర్టీసి అధికారులు ఈడిఓ కరీంనగర్ జోన్ వినోద్ కుమార్, ఈడిఓ మునిశేఖర్, నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జానీరెడ్డిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News