Friday, November 22, 2024

గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్ పూర్, రాయలపూర్, నూతనకల్ గౌడవెల్లి, రావల్ కోల్, రాజ బొల్లారం రాజ బొల్లారం తండా సోమవారం ఎల్లంపేట గ్రామాల్లో ఒక కోటి 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు సోమవారం మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జరుగుతున్నాయని అన్నారు.

 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గానికి దళిత బంధు 1100 యూనిట్లు మంజూకయ్యాయని, త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కన్నా బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఖాళీ స్థలం ఉంటే ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపారు.

ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నారెడ్డి నందారెడ్డి, ఎంపిపి రజిత రాజ మల్లారెడ్డి, జడ్పిటిసి శైలజ విజయానంద్ రెడ్డి, వైస్ ఎంపిపి గోపని వెంకటేష్, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, నాయకులు రాజ మల్లారెడ్డి, భాగ్యరెడ్డి, జగన్ రెడ్డి, అశోక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News