Monday, December 23, 2024

‘తెలంగాణ ప్రగతి పథం’ కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన పాలనా సామర్థ్యంపై విమర్శలు చేసిన వారికి ఈ పుస్తకం సరైన సమాధానాలను ఇస్తుంది : సిఎం

హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ, పరిశ్రమల శాఖ ,వైద్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ, పట్టణ మౌలిక సదుపాయాల శాఖ, ఐటీ శాఖ, ఆర్థిక శాఖ, వివిధ శాఖలలోని ప్రగతి వివరాలు పొందుపరిచిన ‘తెలంగాణ ప్రగతి పథం’ కాఫీ టేబుల్ బుక్‌ను సోమవారం సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, సహచర మంత్రులు, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి తదితర అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మన పాలనా సామర్థ్యంపై విమర్శలు ఎక్కుపెట్టిన వారికి నేటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ ప్రగతి పథం’ పుస్తకం సరైన సమాధానాలను ఇస్తుందని అన్నారు. రాష్ట్రం వివిధ రంగాలో సాధించిన అభివృద్ధి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి శిఖరాలకు చేరుకున్న తీరు యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందని సిఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ ప్రగతి పథం’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి, రూపొందించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తెలుగు విభాగం కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్, భాషా విభాగం సభ్యులు సంబరాజు రవి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ తదితరులను ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించి వారికి పుస్తక ప్రతులను అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News