Monday, December 23, 2024

ముఖ్యమంత్రి కెసిఆర్ లౌకిక నాయకుడు: హోం మంత్రి మహమూద్ అలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆచరణాత్మక లౌకిక నాయకుడని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే నాయకుడని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సిఎం కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పది వేల మంది ఇమామ్ లు, మౌజన్లతో పాటు మిగిలిన 6 నుంచి 7 వేల మంది ఇమామ్‌లు, మౌజన్‌లకు కూడా నెలకు ఐదు వేల రూపాయల భృతి ఇస్తామని ప్రకటించడం పట్ల హోం మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ లు ఇటీవలి వరకు కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అవి ఇవ్వక పోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారనీ, దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో శ్మశాన వాటికల కోసం 125 ఎకరాల భూమిని కూడా ఇవ్వనున్నారనీ తెలియజేశారు. దేశంలో ఇలాంటి నాయకుడు దొరకడం కష్టం మాత్రమే కాదనీ, అసాధ్యం కూడా అని హోం మంత్రి అన్నారు. ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న కేసీఆర్ నిజమైన ముస్లిం శ్రేయోభిలాషి అని అన్నారు. గత తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ అభివృద్ధిని సాధించిందని మంత్రి అన్నారు. మైనారిటీలు, ముస్లింల సమస్యలపై కేసీఆర్‌కు ఎప్పుడు అడిగినా వెంటనే ఆ సమస్యలను పరిష్కరించారన్నారు. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హిందూ-ముస్లిం రాజకీయాలు చేస్తూ సమాజంలో విద్వేషాలను, హింసను పెంపొందిస్తోందని, మరోవైపు తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే రోల్ మోడల్ రాష్ట్రంగా నిలిచిందని, ఇక్కడ అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని, గంగా జమున సంస్కృతి విరాజిల్లుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News