Monday, December 23, 2024

పేద ప్రజల సంతోషమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

తెలకపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల సంతోషమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష, రైతుల సంక్షేమమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం 5వ రోజు పాదయాత్రలో భాగంగా మండలంలోని గట్టురాయిపాకుల, గట్టు నెల్లికుదురు, గౌరెడ్డిపల్లి, కమ్మరెడ్డిపల్లి, తెలకపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల అభివృద్ధికి రైతు బంధు రైతు భీమా లాంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రభుత్వం పేదింటి కుటుంబాల్లోను ఆడబిడ్డ పెళ్లి అంటే భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం తెచ్చారని అన్నారు.

గత ప్రభుత్వాలు ఏనాడు పేదింటి ఆడబిడ్డ వివాహానికి సహాయం చేయలేదని విమర్శించారు. ఆడపడుచులు సగౌరవంగా ఉండాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమని, మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ప్రజలు రైతులు ఆత్మాభిమానంతో బ్రతకాలన్నదే కెసిఆర్ ఆకాంక్ష అని అన్నారు. రాజకీయాల్లోకి రాకముందే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, 2012లో రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తమ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రాఘునందన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ మాధవరం హనుమంత రావు, ఎంపిపి కొమ్ము మధు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News