కంటోన్మెంట్ : హైదరాబాద్‌ను నగరంను విశ్వనగరంగా తీర్చిదిద్దాటానికి ముఖ్యమంత్రి కెసిఅర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలో రోడ్డు విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సిటి చీఫ్ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, కార్పొరేటర్ ముద్దం నర్సింహ్మయాద వ్, టౌన్‌ప్లానింగ్ డిసిపి రఘురాంరెడ్డి, ఏసిపి రాణిలతో కలిసి రహదారి విస్తరణ చేపట్టనున్న ప్రాంతాలను పరిశీలించారు. భవిష్యత్తులో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని రోడ్డు వి స్తరణలో నివాసాలు వ్యాపార సముదయాలు కోల్పోత్తున్న వారు అధైర్యపడవద్దని బాధితులను తగిన న్యాయం చేస్తామని అన్నారు.
ఇప్పటికే డివిజన్ కోట్లాది రూపాయల నిధులతో వరదముప్పు ప్రాంతాలకు బాక్స్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి కాలనీలో అంతర్గత రహదారులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఅర్, కెటిఅర్‌లు హైదరాబాద్ నగరంను విశ్వనగరంగ తీర్చిదిద్దటానిక అహర్నశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో డిఈ బాలకృష్ణ, ఏఈ అరవింద్, వాటర్ వర్క్ ఏఈ తేజ, బిఅర్‌ఎస్ నేతలు నరేందర్‌గౌడ్, మన్నె ఉదయ్‌యాదవ్, మక్కల నర్సింగ్‌రా వు, బల్వంత్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షడు ఇర్ఫాన్, కార్యదర్శి మేకల హరినాథ్, మట్టిశ్రీ ను, బుర్రియాదగిరి, బాబా, ఇబ్బు, సలీం తదితరులు పాల్గొన్నారు.