Wednesday, January 22, 2025

విద్యాభివృద్ధ్దికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి

- Advertisement -
- Advertisement -
  • విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్లరూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి విద్యాభివృద్ధ్దికి కృషి చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కందవాడ గ్రామంలో మన ఊరుమనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్‌ను స్థానిక ఎమ్మెల్యే కాలెయాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో సీఎం కేసీఆర్ మార్పులు తీసుకొచ్చారని, రాష్ట్రవ్యాప్తంగా 1200 గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తునట్లు తెలిపారు.

మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధ్ది చెందుతున్నాయని, గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగిందన్నారు. డిజిటల్ తరగతులు, ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల్లో డైనింగ్ మాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రూ.91 కోట్లతో విద్యార్థులకు టెక్ట్ బుక్స్ అందించనుందని తెలిపారు. సన్నబియ్యంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తుందన్నారు. రూ.25లక్షలతో వారానికి మూడు రోజులు పిల్లల ఆరోగ్యం కోసం రాగి జావా ఇవ్వనునట్లు తెలిపారు.

చేవెళ్ల అభివృద్దికి ఎమ్మెల్యే కాలెయాదయ్య ఎంతో కృషి చేస్తునారని, రాష్ట్రంలో అత్యదిక బ్రిడ్జీలు చేవెళ్లకే వచ్చాయని, నారాయణదాస్‌గూడ బ్రిడ్జీ కూడా త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మె ల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ….కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించే లక్షంతో చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమం అని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్య బాగుంటేనే పిల్లల భావిష్యత్తు బాగుంటుందని, పిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

విద్య, వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు. కందవాడ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మల్లేష్ ప్రభుత్వ పాథమికోన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌కు రూ.1లక్ష, వ్యాయమా సామాగ్రికి రూ.25వేలు, సౌండ్ సిస్టం రూ.25వేలు అందజేశారు. కందవాడ ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి తమ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎంపీటీసీ కావలి రవీందర్ తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ అరుంధతిసాయిరెడ్డి, ఎంఈవో అక్బర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ మిట్ట వెంకట్‌రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, మల్కాపూర్ సర్పంచ్ శేరి శివారెడ్డి, మాజీ సర్పంచ్ బల్వంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శేరి పెంటారెడ్డి, ఉపసర్పంచ్ కావ్యకృష్ణాగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్, ఫయాజ్, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News