Saturday, January 4, 2025

‘పద్మ’ అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల నుంచి ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప, జనగామకు చెందిన గడ్డం సమ్మయ్యను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సిఎం రేవంత్ అభినందించారు. అద్భుతమైన కళా నైపుణ్యంతో వీరిద్దరూ తెలంగాణ సంస్కృతి కళను దేశమంతటా చాటి చెప్పారని సిఎం రేవంత్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News