మొదటి సంవత్సరంలోనే
50,153 ప్రభుత్వ ఉద్యోగాలు
ఇచ్చాం తెలంగాణ ప్రజలకు
సీఎం రేవంత్‌రెడ్డి వీడియో
సందేశం క్యాంప్
కార్యాలయంలో జాతీయ జెండా
ఆవిష్కరించిన సీఎం
మన తెలంగాణ / హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరిం చి, మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అ లాగే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వీడియో సందేశం ద్వారా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకుని తెలంగాణ సిఎం 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భ ంలో ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పం పిణీ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం నా కు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ముఖ్యంగా పేదలు, సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూడడం, రైతు కూలీలు మాకు భరోసాగా ఉండడం ద్వారా మే ము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలని తమ దృష్టికి తీసుకురావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఆనాడు ఆకాశమే హద్దుగా 2004 నుంచి 2014 వరకు ఇందిర మ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు మనం ఇచ్చుకోవడం జరిగిందని, మళ్ళీ పది సంవత్సరాల త ర్వాత ఈరోజు పేదల కళ్లల్లో వెలుగు చూడడాని కి పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇం దిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈ రోజు మనం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.