Monday, December 23, 2024

నీతి ఆయోగ్ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోవడం లేదు!

- Advertisement -
- Advertisement -

తన నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తోంది

హైదరాబాద్: రాష్ట్ర హక్కులను దెబ్బతీయడం, నిధులు విడుదల చేయకపోవడం వంటి వాటికి నిరసనగా ఢిల్లీలో జులై 27 న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోవడం లేదు. కేంద్ర బడ్జెట్ లో చూపిన వివక్షకు వ్యతిరేకంగా తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానని రేవంత్ రెడ్డి శాసన సభలోనే జులై 24న తీర్మానంపై చర్చ జరిగేప్పుడు తెలిపారు.

‘‘ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశం జులై 27న జరుగనున్నది. తెలంగాణ ముఖ్యమంత్రిగా (నేను) నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను. తెలంగాణ హక్కులను దెబ్బతీయడం, తెలంగాణకు రావలసిన నిధులను విడుదల చేయకపోవడానికి, తెలంగాణకు ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వకపోవడానికి నిరసనగా ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

కేంద్రం పేరుకే సమాఖ్య స్ఫూర్తి గురించి చెప్పుకుంటుందే తప్ప బడ్జెట్ లో తెలంగాణకు చేయాల్సినంత అన్యాయం చేయనే చేసింది అని అసెంబ్లీ తీర్మనాంలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News