Tuesday, December 24, 2024

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల, వెల్దండ మండలాలకు చెందిన పలువురు అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శనివారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కు టుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. మాడ్గుల గిరికొత్తపల్లికి చెందిన మౌనికకు రూ. 22వేలు, మాడ్గుల మొగులయ్యకు రూ. 30,500, వెల్దండ పెద్దాపూర్ చెందిన వినో దుకు రూ. 36 వేల చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందాలనే లక్షంతో ఈ ప్రభుత్వం ఈ పథకం తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News